మంగళవారం 9 ఫిబ్రవరి 2010

బీటీ పై విజయం


మోన్శాంటో పై భారతీయ రైతులకి ఇది ఒక తీపి విజయమే!! వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయంపై గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న మోన్శాంటోకి ఇది ఒక ఎదురు దెబ్బగా భావించవచ్చు, కాని BT వంగపై ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అంటే భవిష్యత్తులో ఈ ముప్పు ఏదో ఒక రోజు సంభవించే ప్రమాదం లేకపోలేదు.

ఇప్పటికే BT పత్తి తో మనదేశ మార్కెట్ ను కైవసం చేసుకున్న మోన్శాంటో, వంగతో మరోసారి రైతులని దోచుకోవాలని చూస్తోంది. ఈ BT కథాకమామిషు ఏంటో ఒకసారి చూద్దాం.

BT(Bacillus thuringiensis) అనేది ఒక జన్యువుని మరొక జీవంలో ప్రవేశ పెట్టే పద్దతి. దీనినే జన్యుమార్పిడి అని కూడా అంటారు. జన్యు మార్పిడి అంటే అది ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడమే. ఈ విధానంలో విత్తనంలో ఒకరకమైన క్రిమిని ప్రవేశపెడతారు, ఈ క్రిమివలన ఆ విత్తనం నుండి వచ్చిన మొక్కకు తెగుళ్ళు సోకవు. కానీ ఇలా చేయడం వలన భూమిలో నత్రజనిని అభివృద్ది చేసే క్రిములు కూడా నశించి అసలుకే ఎసరు వస్తోంది, తొలి పంటకి గణనీయమైన దిగుబడి వచ్చినా మలి పంటలలో ఆ దిగుబడి 50% వారకూ తగ్గిపోయి రైతుకి తీరని వేదననే మిగిలిస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అనుకుంటే, జన్యుమార్పిడి చేసిన పంటలు పండించే రైతులు చరంవ్యాదులకి గురవ్వడం, ఆ పంటలని తిన్న పశువులు మరణించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. వీటిన పండించిన రైతులు అప్పులుపాలై, పంటను కోల్పోయినప్పుడు భీమా డబ్బు చెల్లించాల్సిన మోన్శాంటో ముఖం చాటేస్తుండటంతో చివరికి ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం విన్న ప్రత్తి రైతుల ఆత్మహత్యలకి ఏకైక పెద్ద కారణం మోన్శాంటో కంపెనీయే!!

వాణిజ్య పంటలు పండిస్తేనే రైతు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న BT విత్తనాలు, ఇక ఆహార పంటలలో ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పనవసరంలేదు. మానవులపై BT ఆహార ప్రభావాన్ని పరిశోధన చేయకుండానే, అమెరికా లాంటి అగ్ర దేశాలలో ఈ ఆహారాన్ని, పంటలని వినియోగించకుండానే ఇక్కడ ప్రవేశపెడుతున్నారంటే మన దేశాన్ని అగ్ర రాజ్యాలు ప్రయోగశాలగా ఉపయోగించుకుంటున్న విషయం మనకు తెలుస్తుంది. 2400 రకాల దేశీయ వంగను పండింఛే రైతులు BT విత్తనాలని అనుమతిస్తే మోన్శాంటో దగ్గర విత్తనాలని కొనుక్కొవల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఈ పంటని ప్రవేశ పెడితే దానివలన మన దేశీయ పంటరకాలు అతి వేగంగా అంతరించిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి మన రైతాంగం BT పై విజయం సాధించిందనే చెప్పుకోవాలి. ఈ విజయంలో ప్రజా, రైతు సంఘాలతో పాటు గ్రీన్ పీస్, బ్లూ క్రాస్ లాంటి సంస్థలకి కూడా వాటా ఉంది.

సోమవారం 1 ఫిబ్రవరి 2010

చిట్టితల్లిని పొట్టనపెట్టుకున్నారు..

మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని క్రూరమృగాలు సైతం ఆశ్చర్యపోతాయి. అయినా మృగాలతో వీటిని పోల్చి వాటిని తక్కువచేయలేను. అడవి జంతువులు సైతం తమకు హాని చేసినవాటిని తప్ప మిగిలినవాటిని ఏం చేయవు.. ఆహారంకోసం తిన్నా అది జీవ వైవిధ్యాన్ని కాపాడుతుందేగాని ప్రకృతి విరుధ్ధం కాదు.

అయినా ఆ చిట్టితల్లి ఏం పాపం చేసింది? అసలు చిన్నపిల్లలు ఏడిస్తేనే తట్టుకోలేమే! అలాంటిది ఇంత హాని ఎలా చేయాలానిపించింది?? పాపం ఆ చిట్టితల్లి చివరినిమిషంలో ఎంత నరకవేదన అనుభవించిందో!! ఈ వార్త విన్నాక కన్నీరు పెట్టని హృదయాలు ఎన్నుంటాయి..

నిన్న సాక్షి చానల్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ పాపం ఆ పాపాయి పాలైనా తాగిందో లేదో అని కన్నీరు పెట్టడం ఇంకా నా మనసునుండి చెరిగిపోనేలేదు.

అయినా..మనదొక ధౌర్భాగ్యపు వ్యవస్థ.. బోరుబావిలో పడితే రక్షించలేని వ్యవస్థ, కిడ్నాపైతే కాపాడలేని వ్యవస్థ, హత్యకు ప్రయత్నిస్తే అడ్డుకోలేని వ్యవస్థ, నీళ్ళలో మునిగితే రక్షించలేని వ్యవస్థ, మంత్రుల ఎదురుగా వ్యక్థిని చంపుతుంటే చోద్యం చూసే వ్యవస్థ, చోద్యం చూసేవాళ్ళమీద చర్య తీసుకోలేని ఒక నికృష్ఠపు వ్యవస్థ.

ఎవ్వరిని నిలదీసి అడగాలి ఈ పాపం నీదేనని??

బుధవారం 6 జనవరి 2010

oka samasya.. oka parishkaaram!?

నాకు తెలంగాణా ప్రజల సమస్యలు తీరాలని ఆశగా ఉంది అలా అని రాష్ట్రం ముక్కలవ్వాలని లేదు. నాది రెండు నాల్కల ధోరణి కాదు. తెలంగాణా ఉద్యమం సాగినన్ని రోజులు వారి సమస్యల గురించి విధ్యార్థులు ఉద్యమిస్తుంటే చూసి ముచ్చటపడ్డాను కాని రాష్ట్రం విడిపోతుందని తెలియగానే ఎదో తెలియని ఆవేదన. నాకు సంభందిచినదేదో నన్ను వదిలి వెళ్ళిపోతుందన్న భావన. సరిగ్గా ఇలాంటి ఆలోచనే సమైఖ్యాంధ్ర ఉద్యామనికి కారణమైంది. కానీ ఈ ఉద్యమాలు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికే దోహదపడుతున్నాయి తప్ప పరిష్కారం కనుగొనడానికి కొంచెం కూడా ఉపయోగపడట్లేదు. అందుకే నాకు తోచిన పరిష్కారం ఇక్కడ చెప్పదల్చుకున్నాను.

--> తెలంగాణా సమస్య మొదలైంది తొలుత రాష్ట్రానికి పెట్టిన పేరునుండే. ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోదాం,పేరు మార్చి తెలంగాణా అనే పెట్టుకుందాం. మీ రాష్ట్రంలోనే మేమూ ఉంటాం.. మమ్మల్ని ఉండనియ్యండి.

--> పాతికేళ్ళపాటు రాష్ట్రానికి తెలంగాణా ప్రాంతం వారినే ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం. కాదన్న వాడిని రాష్ట్రం నుండి తరిమేద్దాం. అధికారం ముఖ్యం కాదు కలిసుండటం ముఖ్యం.

--> 610 జీవో కచ్చితంగా అమలు చేద్దాం. మా సోదరులని మేము వెనక్కి పిలిపించుకుంటాం.

--> నల్గొండకి నీరిప్పిద్దాం, ఫ్లోరైడ్ సమస్యకి కల్సి పోరాడదాం. మేమూ మీ వెన్నంటి ఉంటాం.

--> పాలమూరు వలసలను, రైతుల, చేనేత కార్మికుల ఆత్మ హత్యలని నిరోధించడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిద్దాం. రుణాల మాఫీ చేసి వారిని కాపాడుకుందాం.

--> గత యాభై యేళ్ళుగా మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ఆస్థుల వివరాలు సేకరించి అక్రమార్కుల భరతం పడదాం. సమస్యలకి మూలకారణాలు తెల్సుకుందాం.

--> రాష్ట్రంలో సెజ్ పేరుతో జరుగుతున్న భూపందేరాన్ని అడ్డుకుందాం. సెజ్లని నిషేదిద్దాం. పేదవాడి భూమిని పేదవాడికే చెందేట్లు చేద్దాం.

--> కులాలు,ప్రాంతాలవారిగా కాకుండా కల్సికట్టుగా అన్ని సమస్య పరిష్కారాలకోసం పోరాడదాం. మన ప్రాంతాల ప్రజల మధ్య సుహృధ్బావ వాతావరణం నెలకొనేట్లు చేద్దాం.

--> సందట్లో సడేమియాలా శ్రీకాకుళం జిల్లాలో నెలకొల్పుతున్న మూడు థర్మల్ విద్యుత్కేంద్రాలు ఒక అణు విద్యుత్కేంద్రం వెనక్కు వెళ్ళేలా చేద్దాం. విశాఖలో బాక్సైట్ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా అక్కడి గిరిజనులతో కలిసి పోరాడుదాం. గాలి గనులు విశాఖ ఉక్కుకి చెందేట్లు చేద్దాం.

--> ఆర్టీసీ (RTC)లో కాంట్రాక్టు విధానానికి వ్యతిరేకంగా పోరాడదాం. ప్రభుత్వ ఉద్యాగాలలో తీసేసిన పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడానికి ఉద్యమిద్దాం.

ఈ సమస్యలన్నింటికీ విభజనే పరిష్కారమా!? ఏది ఏమైనా కలిసే ఉందాం.. మీరు మాతో ఉండకండి, మేమే మీతో ఉంటాం తెలంగాణా రాష్ట్రంలో. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచుదాం, ఒక్కసారి ఆలొచించండి.

మీకు ఎదైన పరిష్కారం(విభజన తప్ప) తోచినట్లైతే అది ఇక్కడ పంచుకోండి

ఇటీవలి వ్యాఖ్యలు